ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కనీస వేతనం చెల్లించాలి

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:29 PM

తమ సమస్యలను పరిష్కరించా లని కోరుతూ ఆశా వర్కర్లు గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో 36 గంటల మహాధర్నా చేపట్టారు.

నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లు

- కలెక్టరేట్‌ వద్ద ఆశా వర్కర్ల ధర్నా

బెలగాం, డిసెంబరు 14: తమ సమస్యలను పరిష్కరించా లని కోరుతూ ఆశా వర్కర్లు గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో 36 గంటల మహాధర్నా చేపట్టారు. దీక్షా శిబిరం వద్దే వంటా-వార్పు నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిర మాట్లాడు తూ.. ‘కనీస వేతనాలు చెల్లించాలి. పనిభారాన్ని తగ్గించాలి. రిటైర్మెంట్‌ కాలాన్ని 62 ఏళ్లకు పెంచాలి. పనిపేరుతో అధికారుల వేధింపులు సరికాదు. రూ.10లక్షల గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ 5 లక్షలు ఇవ్వాలి. వేతనంలో సగం పెన్షన్‌గా చెల్లించాలి. వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌ అమలు చేయాలి. అర్హులైన ఆశాలను ఏఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియా మకాల్లో వెయిటేజీ కల్పించాలి. మరణించిన కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలి. ఆశాల నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆశ వర్కర్లకు టీడీపీ, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల సమ స్యలు పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, జనసేన ఇన్‌చార్జి ఆదాడ మెహన్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Dec 14 , 2023 | 11:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising