ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరసన బాటలో..

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:33 AM

జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ .. ఆరో రోజు ఆదివారం కూడా వారు శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. వారికి టీడీపీ, జనసేన పార్టీ, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలియజేస్తున్నారు.

అంగన్‌వాడీ సమ్మెకు మద్దతుగా చిన్నారులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న తల్లులు

టీచర్‌ కావాలి..వలంటీరు వద్దు

ఆందోళన చేపట్టిన చిన్నారుల తల్లులు

పార్వతీపురం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి)/కురుపాం/సీతంపేట/ పాలకొండ:జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ .. ఆరో రోజు ఆదివారం కూడా వారు శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. వారికి టీడీపీ, జనసేన పార్టీ, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలియజేస్తున్నారు. కాగా వైసీపీ సర్కారు చర్యలపై అంగన్‌వాడీలు మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన దీక్షలు చేపడుతున్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తాళాలను పగలగొట్టి అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహించేందకు అధికార య్రంత్రాంగం తీసుకుంటున్న చర్యలను త్రీవంగా ఖండించారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకూ సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా ఆదివారం కురుపాంలోని కేంద్రం వద్ద చిన్నారులతో కలిసి తల్లులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టి వలంటీర్లకు అప్పగిస్తుండడం తగదన్నారు. తమకు అంగన్‌వాడీ టీచర్‌ కావాలి.. వలంంటీర్‌ వద్దని నినదించారు. పాలకొండలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద కూడా పిల్లల తల్లులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్‌వాడీల సమస్య లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. మరోవైపు సీతంపేటలో అంగన్‌వాడీలు నిర్వహిస్తున్నదీక్షలో పిల్లలతో కలిసి తల్లులు కూర్చొన్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. అంగన్‌వాడీలకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 12:33 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising