ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

ABN, Publish Date - Dec 29 , 2023 | 12:08 AM

మండలంలోని కొత్తవలస-అరుకు రహదారిలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించి సీఐ చంద్రశేఖర్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు(58) 30 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ పూల మొక్కలను విక్రయిస్తూ జీవనం సాగస్తున్నాడు.

కొత్తవలస: మండలంలోని కొత్తవలస-అరుకు రహదారిలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించి సీఐ చంద్రశేఖర్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు(58) 30 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ పూల మొక్కలను విక్రయిస్తూ జీవనం సాగస్తున్నాడు. గురువార ం 12 గంటల సమయంలో పూలమొక్కలను సైకిల్‌ వెనుక పెట్టుకుని విక్రయించడానికి వెళ్తుండగా శృంగవరపుకోట నుంచి కొత్తవలస వైపు వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో రామారావు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. మృతునికి సంబంధించిన వివరాలను సేకరించి బంధువులకు సమాచారం ఇచ్చినట్టు సీఐ తెలిపారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నామన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం శృంగవరపుకోట తరలించారు.

Updated Date - Dec 29 , 2023 | 12:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising