ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భోపాల్‌కు గంజాయి తరలింపు

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:09 AM

ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా నుంచి మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌కు గంజాయి తరలిస్తున్న నలుగురిని సాలూరు రూరల్‌ ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి అరెస్ట్‌ చేశారు.

సాలూరు రూరల్‌: ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా నుంచి మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌కు గంజాయి తరలిస్తున్న నలుగురిని సాలూరు రూరల్‌ ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ కథనం మేరకు.. కోరాపుట్‌ జిల్లా బైపరిగుడ బ్లాక్‌కు చెందిన సర్గిగూడ, మఝిగుడలకు చెందిన బనమాలి పరజ, గురు పరజ, కమల్‌లోచన్‌, హరిచందన్‌ కర్లియాలు 27 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తున్నారు. వారు ఆటోలో గంజాయిని బట్టల మూటల్లో దాచారు. దండిగాం జంక్షన్‌ వద్ద శనివారం సాలూరు రూరల్‌ ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి వాహన తనిఖీలు చేశారు. ఈ సమయంలో ఆటోలో వస్తున్న వారిని ప్రశ్నించ గా వారి సమాధానాలు తేడాగా ఉండడంతో మూటలను సోదా చేశారు. ఈ సోదాల్లో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో గంజాయి స్వాధీనం చేసు కుని, నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 12:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising