ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాతృ మరణాలు నివారించాలి

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:26 AM

జిల్లాలో మాతృ మరణాలు నివారించాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏఏ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు.

వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షిస్తున్న పీవో

పార్వతీపురం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతృ మరణాలు నివారించాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏఏ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, రక్తహీనత నివారణపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. గర్భి ణుల రిజిస్ర్టేషన్‌ పక్కాగా జరగాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రసవ తేదీలను గుర్తించి.. ముందుగా వారిని ఆసుపత్రికి తర లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌమార దశలో ఉన్న బాలికల్లో రక్తహీనత పరీక్షించాలని, సంక్రమిత, అసం క్రమిత వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో శివకుమార్‌, జిల్లా మలేరియా అధికారి శ్యామ్‌కుమార్‌, పీహెచ్‌సీ వైద్యాధికారులు ఉన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising