ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆటో స్టాండ్‌కు స్థలం ఇప్పించండి

ABN, First Publish Date - 2023-11-11T23:48:56+05:30

సాలూరులోని బోస్‌ బొమ్మ వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ఆటో స్టాండ్‌ కోసం తాత్కాలికంగా ఇప్పించాలని డిప్యూటీ సీఎం రాజన్నదొరకు ఆటోడ్రైవర్లు విన్నవించు కున్నారు.

సాలూరు రూరల్‌: సాలూరులోని బోస్‌ బొమ్మ వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ఆటో స్టాండ్‌ కోసం తాత్కాలికంగా ఇప్పించాలని డిప్యూటీ సీఎం రాజన్నదొరకు ఆటోడ్రైవర్లు విన్నవించు కున్నారు. శనివారం బాగువలసకు చెందిన గర్భాపు భాస్కరరావు ఆధ్వర్యంలో వీరు డిప్యూటీ సీఎంను కలిశారు. బోస్‌బొమ్మ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఆటోలను పార్కింగ్‌ చేసుకునేవారని, పోలీసులు అక్కడ నుంచి ఖాళీ చేయించారని చెప్పారు. ప్రస్తుతం రోడ్లుపై ఆటోలను నిలపడం వల్ల లారీల రాకపోకలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయా రు. ఇందుకు ఆయన స్పందిస్తూ పోలీసులు ఆటోడ్రైవర్ల సమస్యను మానవతా ధృక్పథంతో పరిశీలించాలన్నారు. వారికి తాత్కాలికంగా బోస్‌బొమ్మ వెనుక ఖాళీ స్థలంలో ఆటోలు నిలపడానికి అనుమతించాలని పత్రికాముఖంగా కోరారు.

అప్‌గ్రేడ్‌ చేయాలి

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న హిందీ, తెలుగు పండిట్లు, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయాలని పలువురు ఉపాధ్యాయులు డిప్యూటీ సీఎం రాజన్నదొరకు కోరారు. ఈ మేరకు ఆయన్ని శనివారం సాలూరులో కలిసి వినతిపత్రం అందించా రు. జడ్పీ, మునిసిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు, హిందీ పండిట్లు, పీఈటీ లను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేశారని తెలిపారు. గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న తమకు ఇప్పటి వరకు అప్‌గ్రేడ్‌ చేయలేదని వాపోయారు. గిరిజన సంక్షేమశాఖలో ఉన్న 500 మంది పండిట్‌, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయడానికి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. డిప్యూటీ సీఎంను కలిసినవారిలో జోగయ్య, నవీన్‌, సంతోషి తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-11T23:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising