ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘యువగళం’ విజయవంతం చేయండి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:39 PM

భోగాపురం మండలంలోని పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈనెల 20న నిర్వహించ నున్న యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయవంతం చేయాలనిపార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో యువగళం ముగింపు సభ కార్యక్రమంపై చర్చించేందుకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

భోగాపురం: మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌:

భోగాపురం మండలంలోని పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈనెల 20న నిర్వహించ నున్న యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయవంతం చేయాలనిపార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో యువగళం ముగింపు సభ కార్యక్రమంపై చర్చించేందుకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

సభకు తరలిరావాలి..

సాలూరు: యువగళం పాదయాత్ర ముగింపు సభకు తరలి రావాలని ఆ పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. సాలూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పార్టీ పరిశీల కులు, పోలవరం ఇన్‌చార్జి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, నాయకులు నిమ్మాది తిరుపతిరావు, పిన్నింటి ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.

30 వేల మంది సిద్ధంగా ఉండాలి..

రాజాం: పోలిపల్లిలో నిర్వహించనునన యువగళం బహిరంగసభను జయప్రదం చేయాలని రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ కోండ్రు మురళీమోహన్‌, ముగింపు సభ సన్నహక కమిటీ రాజాం నియోజకవర్గ పరిశీలకుడు ఎంఎస్‌ రాజు పిలుపు నిచ్చారు. శ్యాంపురం క్యాంపు కార్యాల యంలో రాజాం అర్బన్‌, రూరల్‌ నాయకులు కార్యకర్తలతో యువగళం సభపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ నాలుగు మండలాలు, రాజాం అర్బన్‌ పరిధి నుంచి 30 వేల మందికిపైగా ముగింపు సభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సూరాడ చంద్రమోహన్‌, పార్టీ పట్టణా ధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, రూరల్‌ అధ్యక్షుడు సుమల వెంకట మన్మ ఽథరావు, గురవాన నారాయణరావు, శాసపు రమేష్‌కుమార్‌, టంకాల కన్నం నాయుడు, బనిశెట్టి వెంకటరావు, జరజాన నీలయ్య, పొన్నాడ భీమేశ్వరరావు, ఆటోకోటి, గుడివాడ ఉత్తరకుమార్‌, టంకాల నాగరాజు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి చెమటలు..

గరుగుబిల్లి: యువగళం పాదయాత్రలో ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయని అరకు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ తెలిపారు. చిలకాంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పోలిపల్లిలో నిర్వహించనున్నట్లు ముగింపు సమావేశానికి కురుపాం నియోజకవర్గం నుంచి ప్రధాన ప్రతినిధులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, యూనిట్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ ఇన్‌చార్జిలతో పాటు కార్యకర్తలు పాల్గొవాలని కోరారు. కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డి.గౌరమ్మ, పార్టీ ప్రతినిధులు బొంగు నారాయణస్వామి, పల్ల మోహనరావు, అరకు టీడీపీ రైతు విభాగం కార్యదర్శి కండేన బలరాంనాయుడు, బి.చంద్రరావు, అక్కేన నారాయణరావు, బలరాంనాయుడు పాల్గొన్నారు.

అధికార పార్టీకి వణుకు పుట్టించాలి..

జామి: పోలిపల్లిలో జరిగే యువగళం ముగింపు కార్యక్రమం విజయ వంతంచేసి అధికారపార్టీకి వణుకు పుట్టించాలని టీడీపీ మండలాధ్యక్షుడు లగుడు రవికుమార్‌ కోరారు. అలమండ పలు పంచాయతీల ముఖ్య నాయకులతో యువగళం ముగింపు సభపై చర్చించారు.

విజయవంతంచేయాల్సిన బాధ్యత అందరిది..

భోగాపురం: పోలిపల్లిలో జరగనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయవంతం చేయవలిసిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు, చంద్రగిరి ఇన్‌చార్జి, భోగాపురం మండల జనసమీకరణ ఇన్‌చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కోరారు. పోలిపల్లిలో పార్టీ మండలాధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ ఆఽధ్వర్యంలో జనసమీకరణపై క్లస్టర్‌ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసమీ కరణ, వచ్చిన వారికి చేయవలిసిన ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించా రు. ప్రతి పంచాయతీ నుంచి సుమారు 500 మంది జనసమీకరణ చేస్తున్న ట్లు కస్టర్‌ ఇన్‌చార్జిలు తెలిపారు. కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ మండలాధ్యక్షుడు కర్రోతుసత్యనారయణ, పిడుగు తోటారావు, దాసరి అప్పలస్వామి పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising