ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విజయమే లక్ష్యంగా పని చేద్దాం: కోళ్ల లలిత కుమారి

ABN, First Publish Date - 2023-11-16T00:07:59+05:30

టీడీపీ-జనసేన విజయమే లక్ష్యంగా కలసి పని చేద్దామని శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు.

శృంగవరపుకోట నవంబరు 15: టీడీపీ-జనసేన విజయమే లక్ష్యంగా కలసి పని చేద్దామని శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. జనసేన అధిష్టానం శాసన సభ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీతో కలసి ఆత్మీయ సమావేశాలు జరపాలన్న నిర్ణయం మేరకు బుధవారం ఇరుపార్టీ ముఖ్యనేతలు స్థానిక ఆర్‌.కె ఫంక్షన్‌ హాల్లో సమావేశమయ్యాయి. శాసన సభ నియోజకవర్గంతో పాటు విశాఖ పార్లమెంట్‌ను గెలిపించుకోవాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పొందుపరిచిన హమీలన్నిటిని నేరవేర్చుతామనే విషయాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఇరుపార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. మంచి ఆశయంతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారన్నారు. దీన్ని నేరవేర్చేందుకు టీడీపీ కార్యకర్తలతో పాటు జనసైనికులు పాటుపడాలన్నారు. వైసీపీ తిరిగి అధికారం చేపట్టేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతుందన్నారు. ఓటరు జాబితాలో బోగస్‌ ఓట్లను చేర్చడం, టీడీపీ సానుబూతి పరుల ఓట్లను తొలగించడం వంటి నీచమైన పనులు చేస్తున్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయ కర్తగా నూతనంగా నియమించిన ఒబ్బిన సత్యనారాయణను అభినందించారు. టీడీపీ-జనసేన జిల్లా కోఆర్డినేటర్‌ లోకం మాధవి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరామప్రసాద్‌, టీడీపీ-జనసేన నాయకులు రమణమూర్తి, కరెండ్ల ఈశ్వరరావు, రెడ్డి వెంకన్న, కాపుగంటి శ్రీనివాసరావు, చక్క కిరణ్‌ కుమార్‌, భీశెట్టి అరుణ, కొణదం మల్లేశ్వరరావు, నానిగిరి రమణాజీ, కోళ్ల వెంకటరమణ, పోట్నూరు రత్నాజీ, లాలం అర్జునరావు, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు వున్నారు.

Updated Date - 2023-11-16T00:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising