‘జగన్ ఇదే నా మీ సంస్కారం?’
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:05 AM
ఒకరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా అత్యంత నీచమైన స్థాయికి దిగి మాట్లాడడం సరికాదని జన సేన పార్టీ నాయకులు గురాన అయ్యలు అన్నారు.
విజయనగరం దాసన్నపేట: ఒకరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా అత్యంత నీచమైన స్థాయికి దిగి మాట్లాడడం సరికాదని జన సేన పార్టీ నాయకులు గురాన అయ్యలు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడుతూ, పవన్‌కల్యాణ్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శన మన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయని సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం ఘోరమన్నారు. ఇండిపెండెంట్‌గా నిలబడి పోటీ చేసిన దమ్ము బర్రెలక్కకైనా ఉందని కాని, తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్‌కి లేదన్నారు. ఇటువంటి చౌకబారు విమర్శలను జగన్మోహన్‌రెడ్డి విడ నాడాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కి గుణపాఠం తప్పదన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:05 AM