ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్రమంగా రేషన్‌ కందిపప్పు విక్రయం

ABN, First Publish Date - 2023-11-20T00:19:31+05:30

మండలంలో ఎంఆర్‌ నగరం రేషన్‌ డిపో డీలర్‌ బుగత సంతోష్‌కుమార్‌ 25 కిలోల రేషన్‌ కందిపప్పును ఆదివారం అదే గ్రామంలో జి.కోటేశ్వరరావు అనే వర్తకుడికి విక్రయిస్తుండగా గ్రామానికి చెందిన ఎన్‌.చిన్న, అప్పలనాయుడు, దుర్గాప్రసాద్‌, సింహాచలం తదితరులు పట్టుకున్నారు.

పార్వతీపురం రూరల్‌, నవంబరు 19: మండలంలో ఎంఆర్‌ నగరం రేషన్‌ డిపో డీలర్‌ బుగత సంతోష్‌కుమార్‌ 25 కిలోల రేషన్‌ కందిపప్పును ఆదివారం అదే గ్రామంలో జి.కోటేశ్వరరావు అనే వర్తకుడికి విక్రయిస్తుండగా గ్రామానికి చెందిన ఎన్‌.చిన్న, అప్పలనాయుడు, దుర్గాప్రసాద్‌, సింహాచలం తదితరులు పట్టుకున్నారు. ఈ విషయం వెంటనే వీఆర్వో సూర్యప్రతాప్‌కు సమాచారం అందించగా వీఆర్వో స్పందించి స్టేట్‌మెంట్‌ తీసుకొని సివిల్‌ సప్లై డీటీ వెంకటరమణకు అప్పగించారు. దీంతో వెంకటరమణ డీలర్‌ ఇంటికి వెళ్లి దర్యాప్తు నిర్వహించారు. డీలర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయాన్ని వీఆర్వో సూర్య ప్రతాప్‌ వద్ద ప్రస్తావించగా గ్రామంలో హార్డ్‌వేర్‌ దుకాణం వద్ద డీలర్‌ 25 కేజీల కందిపప్పు ఉంచారని దీనిని కొంతమంది పట్టుకుని తమకు సమాచారం అందించారని తెలిపారు.

Updated Date - 2023-11-20T00:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising