ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైస్కూల్‌ హెచ్‌ఎం హఠాన్మరణం

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:13 AM

విజయనగరం జిల్లా రేగిడి మండలం కాగితాపల్లి హైస్కూల్‌ ఇన్‌చార్జి హెచ్‌ఎం రంప సుధాకర్‌ (48) బుధవా రం రాత్రి రాజాంలోని తన స్వగృహంలో హఠాన్మరణం చెందా రు.

రేగిడి: విజయనగరం జిల్లా రేగిడి మండలం కాగితాపల్లి హైస్కూల్‌ ఇన్‌చార్జి హెచ్‌ఎం రంప సుధాకర్‌ (48) బుధవా రం రాత్రి రాజాంలోని తన స్వగృహంలో హఠాన్మరణం చెందా రు. ఇది ప్రభుత్వ హత్య అని ఉపాధ్యాయసంఘాలు ఆరోపి స్తున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో సుధాకర్‌ ఒక్కసారి గా విరోచనాలు, వాంతులు చేసుకుని ఇంట్లో కుప్పకూలిపోయిన ట్లు తోటి ఉపాధ్యాయులు తెలిపారు. కుటుంబీకులు ఆసుపత్రి కి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే సుధాకర్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విధినిర్వహణలో తీవ్ర మానసిక ఒత్తిడితో గుండెపోటుకు గురై ఉంటాడని తోటి ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈయన కాగితాపల్లి హైస్కూల్‌లో నాలుగేళ్లుగా సోషల్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇటీవల హెచ్‌ఎం బదిలీతో అధికారులు ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం బాధ్యతలు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో గత నెలలో కాగితాపల్లి హైస్కూల్‌ను డీఈవో, డిప్యూటీ డీఈవో వరుస తనిఖీలు చేశారు. అప్పట్లో పాఠశాల ప్రగతి బాగోలేదంటూ డీఈవో, డిప్యూటీ డీఈవో ఉపాధ్యాయులపై చిర్రుబర్రులాడి.. హెచ్‌ఎం సుధాకర్‌, మరో ఆరుగురు ఉపాధ్యా యులకు చార్జి మెమోలు ఇచ్చారు. దీంతో సుధాకర్‌ పాఠశాలకు వచ్చినా ముభావంగా ఉండడంతో పాటు తీవ్ర మానసికక్షోభకు గురైనట్లు తోటి ఉపాధ్యా యులు చెబుతున్నారు. ఈ ఒత్తిడితో గుండెపోటుకు గురై ఉంటాడంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యగా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ సంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 22 , 2023 | 12:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising