ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హామీలు అమలు చేయాలి

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:46 PM

మునిసిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం నుంచి రాజాం, బొబ్బిలి మునిసిపాలిటీలు, విజయనగరం నగరపాలకసంస్థ పరిధిలో సమ్మెకు దిగారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలుచేయాలని కోరారు.

మునిసిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం నుంచి రాజాం, బొబ్బిలి మునిసిపాలిటీలు, విజయనగరం నగరపాలకసంస్థ పరిధిలో సమ్మెకు దిగారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలుచేయాలని కోరారు.

ఫ రాజాం రూరల్‌: ప్రతిపక్షనేతగా జగన్మోహన్‌రెడ్డి మునిసిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి మాటతప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రామ్మూర్తినాయుడు ఆరోపించారు. రాజాంలో విధులకు గైర్హాజరై, సమ్మెకు దిగిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ సమ్మె వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ప్రభుత్వానిదే బాధ్యతఅని తెలిపారు. ఇచ్చిన హామీల్లో ఒక్కహామీ కూడా అమలుచేయకుండా 99 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం బహుశా జగన్‌రెడ్డిదేనని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్రీనివాస రావు, అనిల్‌కుమార్‌, లక్ష్మి, గురువులు, రాంబాబు, వెంకటి పాల్గొన్నారు.

ఫబొబ్బిలి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా తాత్సారం చేసిందని బొబ్బిలిలో మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులు సమ్మెబాట పట్టారు.తొలిరోజు విధులకు గైర్హాజ రయ్యారు. బొబ్బిలి కోవెల సెంటరు నుంచి సీఐటీయూ ఆధ్వ ర్యంలో పట్టణప్రధాన వీధుల్లోర్యాలీ నిర్వహించారు.సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్నివర్గాల ప్రజలు సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈసందర్భంగా సీఐటీయూజిల్లా అధ్యక్షుడు పి.శంకర రావు మాట్లాడుతూమునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగుతున్న ట్లు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా ఎటువంటి స్పందరా లేదన్నారు. సంఘనాయకులు గౌరీశ్‌, చిన్నికృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising