ధాన్యం కొనుగోలులో రైతులకు మోసం
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:11 AM
ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చినశ్రీను) ఆధ్వర్యంలో దళారులు దోపిడీకి పాల్పడు తున్నారని రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహనరావు ఆరో పించారు.
రాజాం: ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చినశ్రీను) ఆధ్వర్యంలో దళారులు దోపిడీకి పాల్పడు తున్నారని రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహనరావు ఆరో పించారు. శనివారం ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొని రాజాంలో టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా కోండ్రు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాధాన్యానికి రూ. 2183 ప్రకటిస్తే రైతుకు రూ.1500 చెల్లిస్తున్నారని,ఇందులో తేమశాతం, తరుగుపేరుతో క్వింటాకు ఐదు నుంచి పది కేజీలు వరకు కాజేస్తున్నారని ఆరోపించారు.గోనెబరువు 400 గ్రాములు అయితే దీన్ని షాకుగా చూపి అదనంగా వసూలు చేస్తున్నారని, ఇందులో జడ్పీ చైర్మన్ చిన శ్రీను మిల్లర్లతో కుమ్మక్కై మాఫియా నడుపుతున్నాడని విమర్శించారు. ధాన్యం కొను గోలును పర్యవేక్షించాల్సిన జేసీ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ట్రక్‌షీట్లను వైసీపీ నాయకులు మేనేజ్‌చేసి నిజమైన రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిం చారు. ఈ-క్రాప్ సరిగా నమోదుచేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తు న్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాజాం టౌన్ అధ్యక్షుడు నంది సూర్యప్రకా శ్‌రావు, నాయకులు సుమల వెంకట మన్మథరావు, పిన్నింటి మోహన్‌రావు, దూబ ధర్మారావు, మంతిని ఉషారాణి, పొన్నాడ భీమేశ్వరరావు, గురవాన నారాయణరావు గేదల బాలమురళి, ఊరిటి సరేంద్ర, ముగడ శ్రీనివాసరావు, నీలయ్యమాస్టర్, జయ రాం, బాణన విష్ణు, గౌరీశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:11 AM