ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అడుగడుగునా మోసం

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:13 AM

జిల్లాలో పెరిగిన మోసాలు ప్రజల అప్రమత్తతను ప్రశ్నిస్తున్నాయి. బెట్టింగ్‌లు, చిట్టీలు, కల్తీలు, నకిలీలు, చోరీలు ఇలా వివిధ రూపాల్లో ప్రజలు మోసపోతున్నారు. అడుగడుగునా మోసాలకు గురవుతున్న వైనాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి.

చీటింగ్‌ కేసులో స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న ఎస్పీ దీపిక(ఫైల్‌)

అడుగడుగునా మోసం

ఈ ఏడాది పెరిగిన వైనం

అత్యాచారాలదీ అదే దారి

పోక్సో చట్టం కింద శిక్షలు అమలు

యథేచ్ఛగా గంజాయి రవాణా

తగ్గుదల కనిపించిన రోడ్డు ప్రమాదాలు

(విజయనగరం క్రైం)

జిల్లాలో పెరిగిన మోసాలు ప్రజల అప్రమత్తతను ప్రశ్నిస్తున్నాయి. బెట్టింగ్‌లు, చిట్టీలు, కల్తీలు, నకిలీలు, చోరీలు ఇలా వివిధ రూపాల్లో ప్రజలు మోసపోతున్నారు. అడుగడుగునా మోసాలకు గురవుతున్న వైనాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నకొద్దీ దానిని పక్కదారి పట్టించే మార్గాన్వేషణలో ముష్కరులు ఉంటున్నారు. జనానికి కుచ్చటోపీ పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. బయోమెట్రిక్‌ కాపీ చేసి లక్షల రూపాయలు లాక్కొంటున్నారు. ఈ తరహా బాధితులు ఏడాదికాలంగా ఎక్కడికక్కడే కనిపిస్తున్నారు.

జిల్లాలో ఈ ఏడాది క్రైమ్‌ రేటు తగ్గిందని పోలీసులు అంటున్నా కొన్ని అంశాల్లో నేరాలు పెరిగాయి. గంజాయి వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. పోలీసులు దీనిపై నిఘా పెట్టి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా.. ఆకస్మిక తనిఖీలు చేసినా ఇంకా అడ్డదారుల్లో రవాణా జరుగుతూనే ఉంది. సైబర్‌ మోసాలు బాగా పెరిగాయి. అత్యాచారాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా నమోదయ్యాయి. పోలీసులు రెగ్యులర్‌ విధులతో పాటు నిరసనల అదుపు, ప్రజల ఆస్తుల పరిరక్షణ, ట్రాఫిక్‌ విధులు, ప్రముఖ వ్యక్తులకు బందోబస్తు తదితర విధుల వల్ల పని ఒత్తిడి పెరిగి మోసాలను కట్టడి చేయలేకపోతున్నారన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ దొంగతనాల విషయంలో చోరులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. అలాగే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మరిన్ని మోసాలు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో దర్యాప్తులు ముందుకు సాగినా రికవరీ తక్కువ. ప్రజలు అత్యాశకు పోయి మోసాలకు గురవుతున్నారు. సైబర్‌ మోసాలు కింద ఈ ఏడాది విజయనగరం జిల్లా వ్యాప్తంగా 90 కేసులు నమోదు కాగా పోలీసుల దృష్టికి రాని కేసులు అధికంగా వున్నాయి. 2022లో 63 కేసులు నమోదయ్యాయి.

- జిల్లాలో అత్యాచారాలు కూడా పెరిగాయి. గత ఏడాది 21 కేసులు నమోదు కాగా ఈడాది 36 కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసులు విషయానికి వస్తే 2018 నుంచి 2023 వరకూ 11 మందికి శిక్షలు ఖరారు చేశారు. 8 కేసుల్లో 20 ఏళ్లు, ఒక కేసులో మూడేళ్లు, మరో కేసులో నాలుగేళ్లు, ఇంకో కేసులో రెండేళ్ల శిక్షలు అమలయ్యాయి.

- రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు కాస్త ఊరట ఇస్తున్నాయి. స్పీడు బ్రేకర్లు, కలర్‌ బోర్డ్సు, స్టాపర్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడంతో ప్రమాదాలను కొంతవరకూ నియంత్రించగలిగారు. అదే విధంగా మరణాలు, క్షతగాత్రుల సంఖ్య కూడా తగ్గింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 227 మంది మృతి చెందగా, 510 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో 157 మంది మృత్యువాత చెందగా, 491 మంది క్షతగాత్రులయ్యారు.

- గంజాయి రవాణా పెరిగింది. 2022లో 51 కేసులు నమోదు కాగా, 3,181 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. 2023లో 58 కేసులు నమోదు కాగా, 2,558 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నేరాల నియంత్రణకు కృషి: ఎస్పీ

జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ విస్తృతంగా కృషి చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి త్వరితగతిన కేసులను ఛేదిస్తున్నాం. గంజాయి, సారా అక్రమ రవాణాదారులపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నాం. 2024లో కూడా క్రైం రేటును తగ్గించేందుకు కృషి చేస్తాం. ప్రజలంతా సహకరించాలి.

Updated Date - Dec 31 , 2023 | 12:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising