ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:08 AM

దీర్ఘకాలికంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో బుఽధవారం గేటు ధర్నా నిర్వహించారు.

పార్వతీపురంటౌన్‌: దీర్ఘకాలికంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో బుఽధవారం గేటు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆ సంఘ డిపో కార్యదర్శి ఏఎస్టీ బాబు మాట్లాడుతూ 2017 నుంచి ఇప్పటివరకు పీఎఫ్‌ ఏరియర్స్‌ చెల్లించలేదన్నారు. వివిధ అనారోగ్యాల రీత్యా మెడికల్‌ లీవ్‌లో ఉన్న ఉద్యోగులకు వెంటనే బకాయిపడ్డ జీతాలను చెల్లించాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోగల డిపోలో డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించిన చార్టులు వేయడంలో పక్షపాత వైఖరిని విడనాడాలన్నారు. జీవో నెం.2 ప్రకారం దివ్యాంగులకు పదోన్నతలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్య వైఖరి సరికాదన్నారు. సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీవోలను అమలు చేయకుండా పక్షపాత ధోరణిని అవలంభిస్తూ ఉద్యోగులను ఇబ్బందులపాలు జేస్తున్నారన్నారు. ఉద్యోగులను కష్టాలు పాలుజేస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్‌, నారాయణ, ఎస్‌వీరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:08 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising