జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:52 PM
జగన్ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ లన్నీ నిర్వీర్యం అ య్యాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చా ర్జి కేఏ నాయుడు అన్నారు.
గజపతినగరం: జగన్ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ లన్నీ నిర్వీర్యం అ య్యాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చా ర్జి కేఏ నాయుడు అన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరబడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రైతులకు ఎటువంటి న్యాయం జరగడంలేదని కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోలేని దుస్థితి రావడం దారుణమన్నారు. రైతుల నుంచి అదనంగా క్వింటాకు 6 నుంచి 8కేజీలు చొప్పున మిల్లర్లు దోచుకుంటున్నారని వీటిలో ఎమ్మెల్యే నుంచి అధికారుల వరకు పంపకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎ.లక్ష్మునాయుడు, రాష్ట్ర నాయకులు పీవీవీ గోపాల రాజు, గుంట్రోతు గోవింద, మిత్తిరెడ్డి రమణ, ప్రదీప్ పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 11:52 PM