చంద్రబాబుతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:01 AM
చంద్రబాబు నాయుడుతో రాష్ర్టాభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు తెలిపారు. శనివారం జిల్లాలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి వివరించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను తెలియజేశారు.
ఫ గరివిడి: చంద్రబాబుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్య మని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున తెలిపారు.మండలంలో ఎం.దుగ్గివలసలో బాబు ష్యూరిటీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలోనాయకులు సార్ రావు పాల్గొన్నారు.
ఫ విజయనగరం రూరల్: రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని విజయనగరం నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి ఆదితి గజపతిరాజు కోరారు. శనివారం రాత్రి మండ లంలోని ద్వారపూడిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన హామీలను ప్రజలకు వివరించారు. కార్య క్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, జనసేన నాయకురాలు పాలవలస యశస్విని పాల్గొన్నారు.
ఫ శృంగవరపుకోట రూరల్: ప్రజలు వైసీపీ పాలనపై విసిగిచెందారని, చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. శనివారం శృంగవరపుకోట శ్రీనివాసకాలనీలో బాబూష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు జీఎస్ నాయుడు, కోణదం మల్లేశ్వరరావు, నానిగిరి రమణాజీ, కాపుగంటి పాల్గొన్నారు.
ఫ భోగాపురం: ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు కోరారు. శుక్రవారం రాత్రి చేపలకంచేరు పంచాయతీ దిబ్బలపాలెంలో బాబుష్యూరి టీ-భవిషుత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నీలాపు అప్పలరామిరెడ్డి, మైలపల్లిఎల్లాజీ, అరజర్లఎర్రోడుతాత, ఇజ్జరోతు ఈశ్వరరావు పాల్గొన్నారు. కాగా శనివారం పుసపాటిరేగ మండలంలోని పూసపాటిపా లెంలో బాబు ష్యూరిటీ- భవిషుత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వ హించారు.
ఫ మెంటాడ: జగన్ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి అభివృద్ధి చేసే సామర్థ్యం చంద్రబాబు నాయుడుకే ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మెంటాడ మండలం ఆగూరులో బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కాగా 40 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, టీడీపీ మండలాధ్యక్షుడు చలుమూరి వెంకటరావు, ముసలినాయుడు, పడాల గంగులు, రాజగోపాల్ పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:01 AM