ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుతోనే అన్నిరంగాల్లోనూ అభివృద్ధి

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:50 AM

రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికా రంలోకి వస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బేబీనాయన అన్నారు. మండల పరిధి లోని కొత్తరేగ గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, మరో వంద రోజుల్లో ఈ ప్రభుత్వం పడిపో తుందన్నారు

రామభద్రపురం: రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికా రంలోకి వస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బేబీనాయన అన్నారు. మండల పరిధి లోని కొత్తరేగ గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, మరో వంద రోజుల్లో ఈ ప్రభుత్వం పడిపో తుందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయి పోయాయని విమర్శించారు. ఇప్పటికే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగ నంపడానికి సిద్ధమయ్యారని, ఈ తరుణంలో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మడక తిరుపతినా యుడు, మండల టీడీపీ అధ్యక్షుడు కరణం విజయభాస్కరరావు, టీడీపీ నాయకులు గంట సాయికుమార్‌, ఏగిరెడ్డి శ్రీధర్‌, కూనిశెట్టి భాస్క రరావు, కోట వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

ఫ కొత్తరేగ గ్రామంలో బేబీనాయనకు ఘన స్వాగతం లభించింధి. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. మహిళలు మంగళ హార తులిచ్చి బేబీనాయనకు స్వాగతం పలికారు. సుమారు 20 కార్లతో కాన్వా య్‌ వెంటరాగా టాప్‌లేని జీపులో బేబీనాయను ఊరేగించారు. గ్రామం మొత్తం పసుపు జెండాలతో నిండిపోయింది.

Updated Date - Dec 23 , 2023 | 12:50 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising