టొంపలపాడు ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు
ABN, First Publish Date - 2023-12-11T00:20:53+05:30
కురుపాం మండలం గిరిశిఖర గ్రామమైన టొంపలపాడులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆకలి కేకలు మిన్నంటుతు న్నాయి. 42 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ప్రతిరోజూ కేవలం 10 మంది మాత్రమే స్కూలుకు హాజర వుతున్నారు.
కురుపాం రూరల్, డిసెంబరు 10: కురుపాం మండలం గిరిశిఖర గ్రామమైన టొంపలపాడులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆకలి కేకలు మిన్నంటుతు న్నాయి. 42 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ప్రతిరోజూ కేవలం 10 మంది మాత్రమే స్కూలుకు హాజర వుతున్నారు. భోజనం బాగోలేని కారణంగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారు. ఆదివారం ఈ పాఠశాలను జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి రాజశేఖర్ సంద ర్శించారు. ఆయనకు విద్యార్థులు తమ గోడు వెలిబుచ్చారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, కలుషిత నీటితో వంటలు వండుతున్నారని, సంక్షేమాధికారి వారానికో రోజు స్కూలుకు వస్తున్నట్లు విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్, ఐటీడీఏ ప్రాజక్టు అధికారి ఈ పాఠశా లను సందర్శించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. తక్షణం సంక్షేమాధికారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-12-11T00:20:54+05:30 IST