ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయండి

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:15 AM

వచ్చే మూడు రోజుల్లో సెక్టోరల్‌ అధికారులు, ఈఆర్‌వోలు ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడి మౌలిక వసతులను పరిశీలించాలని, జనవరి 4 నాటికి నివేదిక అందించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయండి

ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలి

కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టరేట్‌, డిసెంబరు 30: వచ్చే మూడు రోజుల్లో సెక్టోరల్‌ అధికారులు, ఈఆర్‌వోలు ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడి మౌలిక వసతులను పరిశీలించాలని, జనవరి 4 నాటికి నివేదిక అందించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఎన్నికల ఆర్‌వోలు, ఈఆర్‌వోలు,సెక్టోరల్‌ అధికారులతో శనివారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నివేదికలు వచ్చాక ఏఏ పోలింగ్‌ స్టేషన్లకు ఏఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి నిధులను సమకూరుస్తామన్నారు. నివేదికను ఎన్నికల కమిషన్‌కు కూడా పంపుతామని చెప్పారు. 80 శాతం పైబడి పోలింగ్‌ స్టేషన్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నందున సదుపాయాల కల్పనకు పాఠశాల నిర్వహణా నిధుల నుంచి ఖర్చు చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సంబంధించి గడువు పెంచినందున పెండింగ్‌ దరఖాస్తులన్నింటినీ 10 రోజుల్లో పూర్తిగా డిస్పోజ్‌ చేయాలని తెలిపారు. శత శాతం తప్పుల్లేని ఓటర్ల తుది జాబితాను రూపొందించాలన్నారు. సమావేశంలో జేసీ మయూర్‌అశోక్‌, డీఆర్‌వో అనిత, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, సుదర్శనదొర, సుధారాణి పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:15 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising