ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబును కక్షపూరితంగా జైలుకు పంపించారు

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:51 PM

వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును జైలుకు పంపించిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.

మాట్లాడుతున్న దేవినేని ఉమ

- కుట్రదారుల అంతుచూస్తాం

- మూడు నెలలు ఓపికపట్టండి

- మాజీ మంత్రి దేవినేని ఉమ

రాజాం, డిసెంబరు 17: వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును జైలుకు పంపించిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఆదివారం కిమిడి కళావెంకటరావు క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని జి.సిగడాం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పరిశీలకునిగా హాజరై మాట్లాడారు. మూడు నెలల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూస్తామన్నారు. ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వారందరి అంతు చూస్తామన్నారు. ఈ విషయంలో ఎవరిని విడిచిపెట్టేది లేదన్నారు 45 రోజులు చంద్రబాబును జైల్లో ఉంచిన సీఐడీ అధికారులు కోర్టుకు ఎందుకు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారని ప్రశ్నించారు. మరో మూడు నెలలు ఓపిక పట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 20న జరిగే యువగళం ముగింపు సభకు ప్రతి మండలం నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం త్వరలో పతనం కావడం ఖాయమన్నారు. లోకేష్‌ చేపడుతున్న యువ గళం పాదయాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారని తెలిపారు. యువగళం ముగింపు సభను జయప్రదం చేయాలంటే భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చేలా అం దరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు కుమరాపు రవికుమార్‌, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising