ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయండి

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:45 PM

మిల్లులకు ధాన్యం తీసుకువెళ్తుంటే దోపిడీ చేస్తుండడంతో నేరుగా కళ్లాలకు వెళ్లి కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం వేర్వేరు చోట్ల నాయకులు విలేకరులతో మాట్లాడారు.

రాజాం: మాట్లాడుతున్న కళావెంకటరావు :

మిల్లులకు ధాన్యం తీసుకువెళ్తుంటే దోపిడీ చేస్తుండడంతో నేరుగా కళ్లాలకు వెళ్లి కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం వేర్వేరు చోట్ల నాయకులు విలేకరులతో మాట్లాడారు.

నూర్పుచేసి ధాన్యం నిల్వ : కళా వెంకటరావు

రాజాం: చేతికొచ్చిన సమయంలో తుఫాన్‌ వల్ల పంట పాడయ్యాయని, మిగిలిన పంటలను రూతులు నూర్పులు వేసి కళ్లాల్లో నిల్వచేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు తెలిపారు. మంగళవారం రాజాంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నాలుగున్న రేళ్లలో రాష్ట్రాన్ని సీఎం చెడుగుడుఅడుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూ ములు దోచుకోవడం తప్ప కాపాడాలనే ఆలోచన ఏఒక్క వైసీపీ నాయకుడికి కనిపిం చలేదన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తాడే పల్లిలో కూర్చొని ఎక్కడికైనా హెలికాప్టర్‌లో వెళ్లి అక్కడ దిగిపోవడం తప్ప ఎప్పుడైనా రోడ్లపై ప్రయాణించావా అని కళా వెంకటరావు ప్రశ్నించారు. చివరకు తిరుపతి దేవస్థానం భూములు కూడా అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిమ్రలు లేక, రియల్‌ఎస్టేట్లు లేక భవన నిర్మాణ కార్మికులు లబోదిబోమంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్‌నాయుడు ,.కుమరాపు రవికుమార్‌ పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర లేదు..రాయితీలు లేవు

వంగర:రైతులకు గతంగిట్టుబాటు ధరలు,రాయితీలు ఉండేవని, ప్రస్తుతం గిట్టుబాటు ధర, రాయితీలు లేకుండాపోయాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు ఆరోపించారు. మంగళవారం కొండ చాకరాపల్లి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలకు అం డగా ఉంటామని తెలిపారు. సీఎం జగన్‌ రైతులను నిండా ముంచేశారని ఆరో పించారు. కనీసంధాన్యం కొనుగోలు, గిట్టుబాటు ధరలు కల్పించలేని ప్రభు త్వానికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాలువల ద్వారా నీరు విడుదలలో కూడా జగన్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమ య్యిందని ఆరోపిం చారు. మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి మాట్లాడుతూ జగన్నాటకాలకు నూకలు చెల్లాయన్నారు. రైతులు, ఉద్యోగులు ముకుమ్మడిగా సాగనంపడానికి సిద్ధమ య్యారని తెలిపారు. ముఖ్యమంత్రి చేతకాని పరిపాలనకు అన్ని రంగాల్లో ఆం దోళనలు, నిరసనలే నిదర్శనమన్నారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు మురళీకృష్ణ, పైత వెంకటరమణ, త్రినాఽథ, ఖగేంద్ర, రాంబాబు పాల్గొన్నారు.

విశ్వసనీయత లేని వ్యక్తి జగన్‌: నాగార్జున

చీపురుపల్లి: సొంత తల్లికి, చెల్లికి ద్రోహం చేసినవాడు.. రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడని, విశ్వసనీయత లేని వ్యక్తి జగన్‌ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. మంగళవారం ఆయన చీపురుపల్లిలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం జగన్‌ లక్షణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ పాలనపై విసుగుచెందిపోయారని, త్వరలో జరగబోవు ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తన తండ్రికి ఆత్మలాంటి కేవీపీ, నీడగా ఉన్న సూర్యుడు ఇప్పుడు జగన్‌ వెంట లేరంటే ప్రజలు గమనిస్తున్నారని, దళితలకు, మైనార్టీలకు మోసం చేశారని, సిటిజన్‌ బిల్లుకు మద్దతుగా ఓటువేసి వారికి అన్యాయం చేశారని ఆరోపించారు.

Updated Date - Dec 26 , 2023 | 11:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising