కొండ గూడెం మాజీ సర్పంచ్ ఇంటిలో చోరీ
ABN, First Publish Date - 2023-11-10T00:35:49+05:30
మండలంలోని కొండగూడెం పంచాయతీ మాజీ సర్పంచ్ కెంబూరు సూర్యారావు ఇంటిలో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగినట్టు ఎస్‌ఐ బుడు మూరు లోకేశ్వరరావు తెలిపారు
సంతకవిటి: మండలంలోని కొండగూడెం పంచాయతీ మాజీ సర్పంచ్ కెంబూరు సూర్యారావు ఇంటిలో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగినట్టు ఎస్‌ఐ బుడు మూరు లోకేశ్వరరావు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యారావు కుటుంబ సభ్యులు బుధవారం ఇంటికి తాళాలు వేసి బంధువుల ఇంటికి వేరే ఊరు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలో ఎవరూ లేరని గమనించిన దొంగలు బుధ వారం అర్థరాత్రి దాటిన తర్వాత చోరీకి పాల్పడి ఉంటారన్నారు. గురువారం ఉద యం సూర్యారావు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులకొట్టి ఉండడంతో పాటు ఇంటిలో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు తులాల పావు బంగారు నగలు, 30 తులాల వెండి వస్తువులు కొంతమేర నగ దు దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించామని రాజాం రూరల్ సిఐ శ్రీనివాస్ సీఐ శ్రీని వాస్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Updated Date - 2023-11-10T00:35:50+05:30 IST