ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వాహనం ఢీకొని బౌరుబిల్లి మృతి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:40 PM

మండలంలోని తారాపురం సమీపంలోని జాతీయ రహ దారిపై ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని బౌరుబిల్లి మృతి చెంది నట్లు అటవీశాఖ రేంజర్‌ బి.అప్పలరాజు తెలిపారు. తొలుత మృతి చెందిన జంతువు చిరుతపులి అని ప్రచారం కావడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పిల్లి చూడడానికి నల్లమచ్చలతో చిరుత పులిలా ఉంటుందని, రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుంటుందని, అంతరించి పోతున్న అరుదైన జాతికి చెందిన బౌరుబిల్లి అని అటవీశాఖాధికారులు తెలిపారు. కాగా వెట్నర్నరీ డాక్టర్‌ హిరణ్య కళేబారానికి పోస్టుమార్టం చేశారు.

రామభద్రపురం: మండలంలోని తారాపురం సమీపంలోని జాతీయ రహ దారిపై ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని బౌరుబిల్లి మృతి చెంది నట్లు అటవీశాఖ రేంజర్‌ బి.అప్పలరాజు తెలిపారు. తొలుత మృతి చెందిన జంతువు చిరుతపులి అని ప్రచారం కావడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పిల్లి చూడడానికి నల్లమచ్చలతో చిరుత పులిలా ఉంటుందని, రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుంటుందని, అంతరించి పోతున్న అరుదైన జాతికి చెందిన బౌరుబిల్లి అని అటవీశాఖాధికారులు తెలిపారు. కాగా వెట్నర్నరీ డాక్టర్‌ హిరణ్య కళేబారానికి పోస్టుమార్టం చేశారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు..

దత్తిరాజేరు: మండలంలోని శిఖారుగంజి రోడ్డు జంక్షన్‌ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. స్టేషన్‌ బూర్జివలస ఇన్‌చార్జి ఎస్‌ఐ శిరీష తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆ వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుడి ఒంటిపై నీలం రంగు చలికోటు ఉంది. మృతుడి వయస్సు 59 సంవత్సరాలు ఉండవ చ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం పీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 11:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising