వెనుకబడిన కులాల ఓటు బ్యాంకు దోపిడీ
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:56 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్ర్తీయమైన కుల గణన చేపట్టకుండా అణగారిన కులాల ఓటు బ్యాంకును దోచుకుంటున్నాయని విశ్వ బ్రాహ్మణ సంఘ నేత ముగడ వెంకటరమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఫంక్షన్ హాలులో మం గళవారం అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలు ఎన్ని? వారు ఎంతమంది అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర లేకపోవడం సిగ్గుచేటని అన్నారు
బొబ్బిలి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్ర్తీయమైన కుల గణన చేపట్టకుండా అణగారిన కులాల ఓటు బ్యాంకును దోచుకుంటున్నాయని విశ్వ బ్రాహ్మణ సంఘ నేత ముగడ వెంకటరమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఫంక్షన్ హాలులో మం గళవారం అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలు ఎన్ని? వారు ఎంతమంది అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. సీపీఎం నేత శంకరరావు మాట్లాడుతూ బిహార్‌లో కులగణన చేసిన తరువాత 36 శాతం ఎంబీసీల పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నట్లు తేలిందన్నారు. జనవరి 28న జరిగే సదస్సు తరువాత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మత్స్యకార, దాసరి, నాయీ బ్రాహ్మణ తదితర సంఘాలకు చెందిన ప్రతినిఽధులు కంచి వెంకటరావు, ఆదినారాయణ, చిన్నారావు, న్యాయవాది గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:56 PM