ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శాంతిభద్రతలపై అప్రమత్తం

ABN, Publish Date - Dec 24 , 2023 | 12:45 AM

శాంతి భద్రతల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, దర్యాప్తులో ఉన్న కేసుల పరిష్కారంలో చర్యలు వేగవంతం చేయాలని విశాఖ రేంజి డీఐజీ ఎస్‌.హరికృష్ణ ఆదేశించారు.

రాజాం రూరల్‌: శాంతి భద్రతల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, దర్యాప్తులో ఉన్న కేసుల పరిష్కారంలో చర్యలు వేగవంతం చేయాలని విశాఖ రేంజి డీఐజీ ఎస్‌.హరికృష్ణ ఆదేశించారు. రాజాం రూరల్‌ పొలీస్‌ స్టేషన్‌ను శనివారం ఆయ న తనిఖీ చేశారు. కేసుల పురోగతి పై రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌.ఐ.లతో చర్చించారు. రికార్డులను పరిశీలించారు. ఏఎస్పీ ఆస్మా ఫర్హీన్‌, చీపురుపల్లి డీఎస్పీ శ్రీనివాస చక్రవర్తి, తదితరులు పాల్గొ న్నారు. అంతకుముందు కార్యాలయ ప్రాంగణంలో డీఐజీ మొక్కలు నాటారు.

కొత్తవలస: యువత సైబర్‌ నేరాల వలలో పడకుండా జాగ్రత్త పడాలని విశాఖపట్టణం రేంజ్‌ పోలీసు డీఐజీ హరికృష్ణ సూచించారు. శనివారం కొత్తవలస పోలీసు స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా పరిశీలించారు. స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ యువత ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలను చాలా వరకు అరికట్టగలిగామన్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన నిఘాను ఉంచామని తెలిపారు. డీఐజీతో పాటు విజయనగరం అడిషనల్‌ ఎస్పీ ఆస్మా ఫర్హీన్‌, డీఎస్పీ గోవిందరావు, కొత్తవలస, శృంగవరపుకోట సీఐలు చంద్రశేఖర్‌, బాలసూర్యారావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising