లోకేశ్ పాదయాత్రతో వైసీపీలో అలజడి
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:46 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్ర ఊహించినదానికంటే ఎక్కువ విజయవంతమైందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న అన్నారు.
పోలేపల్లి భారీ బహిరంగ సభలో ఎన్నికల శంఖారావం
టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న
నక్కపల్లి, డిసెంబరు 17: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్ర ఊహించినదానికంటే ఎక్కువ విజయవంతమైందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే వి.అనిత ఇంటి వద్ద నిర్వహించిన పార్టీ నాయకుల నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేశ్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో వైసీపీలో అలజడి మొదలైందని అన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా 20వ తేదీన పోలేపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎన్నికల శంఖారావాన్ని పూర్తిస్తామని వెంకన్న చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నా టీడీపీ అధికారంలో వుండాలనే విషయాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. వంగలపూడి అనిత మాట్లాడుతూ, పాయకరావుపేట నియోజకవర్గంలో మూడు రోజులపాటు నిర్వహించిన యువగళం పాదయాత్ర విజయవంతమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట నియోజకవర్గం పరిశీలకుడు బడేటి చంటి, టీడీపీ నేతలు కొప్పిశెట్టి వెంకటేశ్, కొప్పిశెట్టి కొండబాబు, వైబోయిన రమణ, లాలం కాశీనాయుడు, అమలకంటి అబద్ధం వినోద్‌రాజు, గింజాల లక్ష్మణరావు, కొప్పిశెట్టి బుజ్జి, జానకి శ్రీను, గోసల చినతాతారావు, అల్లు నర్సింహమూర్తి, కోన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:46 AM