ఎక్కడి చెత్త అక్కడే..
ABN, Publish Date - Dec 30 , 2023 | 01:24 AM
మునిసిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగడంతో పట్టణంలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. మొత్తం 116 మందికిగాను 98 మంది సమ్మె చేస్తుండడంతో పారిశుధ్యం క్షీణిస్తున్నది. సుమారు 16 వేల గృహాల నుంచి చెత్త సేకరణ నిలిచిపోయింది.
నర్సీపట్నం, అనకాపల్లిల్లో క్షీణిస్తున్న పారిశుధ్యం
ఇంటింటా జరగని చెత్త సేకరణ
రోడ్లపై పేరుకుపోతున్న చెత్త కుప్పలు
నాలుగో రోజుకు చేరిన పారిశుధ్య కార్మికుల సమ్మె
నర్సీపట్నం, డిసెంబరు 29: మునిసిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగడంతో పట్టణంలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. మొత్తం 116 మందికిగాను 98 మంది సమ్మె చేస్తుండడంతో పారిశుధ్యం క్షీణిస్తున్నది. సుమారు 16 వేల గృహాల నుంచి చెత్త సేకరణ నిలిచిపోయింది. దీంతో ఇళ్లల్లో డస్ట్‌బిన్లు నిండిపోవడంతో ప్రజలు వీధుల్లోని డంపర్ బిన్లు వద్ద చెత్తను పడేస్తున్నారు. ఇవి కూడా నిండిపోవడంతో చుట్టుపక్కల చెత్త పేరుకుపోతున్నది. దీంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. దుర్వాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. కాగా ఇందిరా మార్కెట్‌లో ఖాళీ స్థలం డంపింగ్ యార్డుగా తయారైంది. కూరగాయలు, పూలు, పండ్లు దుకాణదారులు వ్యర్థాలను ఇక్కడ వేస్తుండడంతో చెత్త పేరుకు పోయింది. నాలుగు రోజులగా సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులు శుక్రవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.
ఫొటోరైటప్:
29ఎకెపిటౌన్-7- పారిశుధ్య కార్మికులతో ధర్నా చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు
అనకాపల్లిలో ధర్నా
అనకాపల్లిటౌన్, డిసెంబరు 29: జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. జోనల్ కార్యాలయం ఎదుట కార్మికులతోపాటు ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వైఎన్ భద్రం, కోన లక్ష్మణ, కోరిబిల్లి శంకరరావు, పెంటకోట ప్రసాద్, ఆర్.శంకరరావు, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 01:25 AM