జన సైనికుడికి న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తాం
ABN, First Publish Date - 2023-12-11T00:38:04+05:30
మాడుగుల జనసైనికుడు గుణసాయి ఆత్మహత్యాయత్నానికి కారణమైన మాడుగుల ఎంపీపీ వేమవరపు రామధర్మజ, అతని కుమారుడు సాయిచందన్‌పై 24 గంటల్లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు డిమాండ్ చేశారు.
24 గంటల్లో మాడుగుల ఎంపీపీ, అతని కుమారుడుపై కేసు నమోదు చేయాలి
జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు
పంచకర్ల రమేష్‌బాబు డిమాండ్
కొత్తూరు, డిసెంబరు 10: మాడుగుల జనసైనికుడు గుణసాయి ఆత్మహత్యాయత్నానికి కారణమైన మాడుగుల ఎంపీపీ వేమవరపు రామధర్మజ, అతని కుమారుడు సాయిచందన్‌పై 24 గంటల్లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు డిమాండ్ చేశారు. లేకుంటే జనసేన పార్టీ సైనికులమంతా గుణసాయికి న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనకాపల్లి ఎన్‌టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసైనికుడు గుణసాయిని ఆదివారం ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు కారణాలను గుణసాయిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి మూడు నెలలు మాత్రమే సమయముందని, ఆ విషయాన్ని మరిచిపోయి జనసేన, టీడీపీ కార్యకర్తలపై తరచూ దాడులకు పాల్పడడం అన్యాయమన్నారు. ఉప ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతంలో ఇటువంటి దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. మరో మూడు నెలలు తరువాత జనసేన, టీడీపీ పార్టీలు అధికారంలోకి వస్తాయని, అప్పుడు వడ్డీతో సహా లెక్క సరిచేస్తామని హెచ్చరించారు. తక్షణమే ఎంపీపీ, అతని కుమారుడుపై కేసు నమోదు చేసి జనసైనికుడు గుణసాయికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-12-11T00:38:05+05:30 IST