విశాఖ అబ్బాయి.. వెనిజులా అమ్మాయి
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:48 AM
ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి ఆ ప్రేమికులు చాటిచెప్పారు. ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది.
ప్రేమ వివాహంతో ఒక్కటైన జంట
ఉక్కుటౌన్‌షిప్, డిసెంబరు 16: ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి ఆ ప్రేమికులు చాటిచెప్పారు. ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది. స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ ప్రాంతానికి చెందిన మునుకొటి గమన్ అమోరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకునికి వెనిజులా దేశానికి చెందిన ఇస్తఫెసియా అనే యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. అదికాస్త ప్రేమకు దారితీయడంతో ఇరువురు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు చెప్పి ఒప్పించారు. దీంతో వారి వివాహం శనివారం స్టీల్‌ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో హిందూ సంప్రదాయంలో ఘనంగా జరిగింది.
Updated Date - Dec 17 , 2023 | 12:48 AM