ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:04 AM

మండలంలోని పెద్దగెడ్డ మలుపు వద్ద ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం, వ్యాన్‌ ఢీ కొనడంతో ముగ్గురు గిరిజన యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

పెద్దగెడ్డ వద్ద వ్యాన్‌ ఢీకొని గాయపడిన యువకులు

చింతపల్లి, డిసెంబరు 25: మండలంలోని పెద్దగెడ్డ మలుపు వద్ద ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం, వ్యాన్‌ ఢీ కొనడంతో ముగ్గురు గిరిజన యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. సోమవారం జాజులపాలెం గ్రామానికి చెందిన పాంగి రాము, మర్రి మధు, లగిసపల్లి గ్రామానికి చెందిన పాంగి సుధాకర్‌ ముగ్గురు ద్విచక్ర వాహనంపై చింతపల్లి వచ్చారు. వారి పని ముగించుకుని సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి చింతపల్లి వస్తున్న వ్యాన్‌, వీరి ద్విచక్ర వాహనం పెద్ద గెడ్డ మలుపు వద్ద బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు గిరిజన యువకులకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొనిరాగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 12:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising