ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN, First Publish Date - 2023-11-20T00:15:52+05:30

వైసీపీ పాలనలో దోపిడీలు, దౌర్జన్యం, అవినీతి తప్పా అభివృద్ధి జరగలే దని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. అగనంపూడిలో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

పెదగంట్యాడలో కరపత్రాలతో టీడీపీ నాయకులు

‘బాబు ష్యూరిటీ’ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

అగనంపూడి, నవంబరు 19: వైసీపీ పాలనలో దోపిడీలు, దౌర్జన్యం, అవినీతి తప్పా అభివృద్ధి జరగలే దని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. అగనంపూడిలో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అతలాకుతలంగా మారిందని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలు, అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడా జాడే లేదన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పల్లా పేర్కొన్నారు. అనంతరం నాయకులు ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌, టీడీపీ 85వ వార్డు అధ్యక్షుడు కర్రి దశేంద్ర, నాయకులు గంతకోరు అప్పారావు, కరణం సత్యారావు, సత్యనారాయణ, కె.తిలక్‌, రాజు, డి.రమేశ్‌, ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పెదగంట్యాడలో..

పెదగంట్యాడ: వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్ర ప్రగతిని తిరిగి గాడిలో పెట్టేందుకు రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకరావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి అన్నారు. పెదగంట్యాడలో నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన నెల్లిముక్కు, చినకోరాడ, సిద్ధేశ్వరం, దుర్గవానిపాలెం మీదుగా పెదగంట్యాడ కూడలి వరకు సాగింది. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి, నాయకులు పెద్దాడ సోమునాయుడు, నమ్మి అప్పారావు, పెరుమాళ్లు, పెంటిరాజు, తదితరులు పాల్గొన్నారు.

88వ వార్డులో..

కూర్మన్నపాలెం: రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ పాలన రావాలని సీనియర్‌ నాయకుడు గొలగాని సన్యాసిరావు అన్నారు. 88వ వార్డు యాదవజగ్గరాజుపేటలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కాలనీలో టీడీపీ-జనసేన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉరుకూటి శ్రీనివాసరావు, రాము, గంగరాజు, వెంకట్రావు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:15:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising