ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికలకు ముందే టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:47 AM

ఎన్నికలకు ముందే ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర నేత గాదె శ్రీనివాసులు నాయుడు కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న గాదె శ్రీనివాసులు నాయుడు

పీఆర్టీయూ రాష్ట్ర నేత గాదె శ్రీనివాసులు నాయుడు

కశింకోట, డిసెంబరు 17: ఎన్నికలకు ముందే ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర నేత గాదె శ్రీనివాసులు నాయుడు కోరారు. ఆదివారం స్థానిక గుత్తా ప్రమీలా గార్డెన్స్‌లో జరిగిన అనకాపల్లి జిల్లా పీఆర్టీయూ ఉపాధ్యాయుల వన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. జీపీఎస్‌ను ఉద్యోగులు తిరస్కరిస్తున్నందున పాత పింఛన్‌ విధానాన్ని అమలుచేయాలన్నారు. ఉపాధ్యాయులకు బకాయిలను వెంటనే చెల్లించాలని, బకాయి ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని, ఉపాధ్యాయులపై పనిఒత్తిడి తగ్గించాలని, బోధనేతర పనులు అప్పగించవద్దని కోరారు. జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెద్ది నాయుడు, అసోసియేట్‌ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు, పింఛన్‌దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ద కాశీ విశ్వేశ్వరరావు, ఎలమంచిలి డిప్యూటీ డీఈవో అప్పారావు, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు రొంగలి అప్పలరాజు, పారిశ్రామికవేత్త దిలీప్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:47 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising