ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉండాలి

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:53 AM

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని జిల్లా కలెక్టర్‌ డా. ఎ. మల్లికార్జున సూచించారు. శుక్రవారం ఆయన విశాఖ వేలీ స్కూల్లో గేమ్స్‌ ఫెస్టు 2023-24 పోటీలను ప్రారంభించారు.

ఆరిలోవ, డిసెంబరు 29 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని జిల్లా కలెక్టర్‌ డా. ఎ. మల్లికార్జున సూచించారు. శుక్రవారం ఆయన విశాఖ వేలీ స్కూల్లో గేమ్స్‌ ఫెస్టు 2023-24 పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందన్నారు. చదువు ఎంత అవసరమో ఆటలు కూడా అంతే అవసరమని, ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమం తప్పకుండా క్రీడలపై తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. అలాగే మంచి ఆహారం తీసుకోవాలని, తరచూ మంచినీరు తాగాలని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన పాఠశాలలో కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన విలు విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు అలాగే వార్షిక పత్రికను ఆవిష్కరించారు. కాగా విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మోటార్‌ బైక్‌పై పది మంది జాతీయ జెండా పట్టుకొని చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నది. అలాగే కరాటే క్రీడాకారులు వెలిగిన మంటలో మండుతున్న పెంకులను చేతులతో పగలగొట్టడం అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ఈశ్వరీ ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising