ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:48 PM

ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఆ యూనియన్‌ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఆనందరావు, నాతవరం తహసీల్దార్‌ వాసు, ఐసీడీఎస్‌ సీడీపీవో శ్రీకళ అంగన్‌వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపారు.

గొలుగొండ, డిసెంబరు 17 : ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఆ యూనియన్‌ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఆనందరావు, నాతవరం తహసీల్దార్‌ వాసు, ఐసీడీఎస్‌ సీడీపీవో శ్రీకళ అంగన్‌వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఆనందరావు మా ట్లాడుతూ ప్రభుత్వం ఐదు సమస్యలు పరిష్కరించేం దుకు అంగీకరించిందని చెప్పారు. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడానికి, రిటైర్‌మెంట్‌ సమయంలో ఇచ్చే నగదు యాబై వేల నుంచి లక్ష రూపాయలకు, ఆయాలకు ఇరవై వేల నుంచి నలబై వేలకు పెంచడానికి, మినీ సెంటర్లు అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రభుత్వం ఆమోదించిందన్నారు. అలాగే టీఏ డీఏల మంజూరుకు కూడా ఆమోదం తెలిపిందని, సమ్మె విరమించాలని కోరారు. దీనిపై అంగన్‌వాడీ కార్యకర్త్తలు స్పందిస్తూ ప్రభుత్వానికి అందించిన వినతిపత్రంలో తెలిపిన డిమాండ్లన్నీ అమలు చేసేవరకూ సమ్మె విరమించమని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికా రులు తెలిపారు.ఈ సమావేశంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు భ్రమరాంబ, మంగతాయారు. సత్య, రాయపురెడ్డి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising