ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అటవీ సంపద పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక

ABN, First Publish Date - 2023-12-11T01:12:16+05:30

ఏజెన్సీలోని అటవీ సంపద పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(ఏపీ పీసీసీఎఫ్‌- రీసెర్చ్‌, ఐటీ) అజయ్‌కుమార్‌ నాయక్‌ తెలిపారు. ఆదివారం స్థానిక డీఎఫ్‌వో చిట్టపుల్లి సూర్యనారాయణతో కలిసి ఆయన చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించారు. కృష్ణాపురం పైన్‌ తోటలు, చింతలూరు టింబర్‌ డిపో, ఆర్‌వీనగర్‌ ఏపీ ఎఫ్‌డీసీ కాఫీ తోటలను ఆయన పరిశీలించారు.

అటవీశాఖ ఉద్యోగులతో మాట్లాడుతున్న ఏపీ పీసీసీఎఫ్‌(రీసెర్చ్‌, ఐటీ) అజయ్‌కుమార్‌ నాయక్‌

- నెల రోజుల్లో కృష్ణాపురంలో ఎకో టూరిజం

- ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు

- ఏపీ పీసీసీఎఫ్‌(రీసెర్చ్‌, ఐటీ) అజయ్‌కుమార్‌ నాయక్‌

చింతపల్లి, డిసెంబరు 10: ఏజెన్సీలోని అటవీ సంపద పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(ఏపీ పీసీసీఎఫ్‌- రీసెర్చ్‌, ఐటీ) అజయ్‌కుమార్‌ నాయక్‌ తెలిపారు. ఆదివారం స్థానిక డీఎఫ్‌వో చిట్టపుల్లి సూర్యనారాయణతో కలిసి ఆయన చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించారు. కృష్ణాపురం పైన్‌ తోటలు, చింతలూరు టింబర్‌ డిపో, ఆర్‌వీనగర్‌ ఏపీ ఎఫ్‌డీసీ కాఫీ తోటలను ఆయన పరిశీలించారు. చింతపల్లి డీఎఫ్‌వో కార్యాలయంలో అటవీశాఖ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత విలువైన అటవీ సంపద ఉందన్నారు. ఈ ప్రాంత అడవులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అటవీ సంపదను కాపాడేందుకు ఉద్యోగులకు దిశానిర్దేశం చేశామన్నారు. నూతన విధానాలు అమలులోకి తీసుకొచ్చామన్నారు. అటవీశాఖ ద్వారా ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. చింతపల్లి మండలంలోని కృష్ణాపురం పైన్‌ తోటల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.25 లక్షల నిధులను మంజూరు చేసినట్టు చెప్పారు. నెల రోజుల్లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రధానంగా పర్యాటకులకు మరుగుదొడ్లు, టెంట్లు, ఫైర్‌ క్యాంప్‌తో పాటు వినోద క్రీడలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొత్తగా ఏర్పాటైన చింతపల్లి డివిజన్‌ పరిధిలో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. చింతపల్లి డివిజన్‌లో రూ.1.5 కోట్ల నిధులతో డీఎఫ్‌వో బంగ్లా, కార్యాలయం నిర్మాణం చేపడుతున్నామన్నారు. డివిజన్‌ పరిధి అటవీశాఖ ఉద్యోగులు బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో చిట్టపుల్లి సూర్యనారాయణ, రేంజ్‌ అధికారులు ఎల్‌బీకే పాత్రుడు, కె. జగదీశ్వరరావు, బి.వీరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T01:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising