స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించండి
ABN, First Publish Date - 2023-12-12T01:31:48+05:30
ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలపై సత్వరమే స్పందించాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులను ఆదేశించారు.
అధికారులకు జేసీ జాహ్నవి ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, డిసెంబరు 11: ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలపై సత్వరమే స్పందించాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో అసిస్టెంట్ కలెక్టర్ స్మరణ్‌రాజ్, డీఆర్‌వో దయానిధి కలిసి వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి 338 అర్జీలు స్వీకరించారు. కొంతమంది సమస్యలను జేసీ జాహ్నవి స్వయంగా ఆలకించారు. అనంతరం అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు బద లాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్పందన అర్జీల్లో ఎక్కువ శాతం భూ సమస్యలు, రేషన్‌కార్డుల మంజూరుకు సంబంధించి వుంటున్నాయని, ఆయా శాఖల అధికారులు వీటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు.
Updated Date - 2023-12-12T01:31:50+05:30 IST