ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భగ్గుమంటున్న బియ్యం ధరలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:21 AM

బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. తుఫాన్‌ పేరు చెప్పి మిల్లర్లు గత వారం, పది రోజుల్లో బియ్యం ధరలు పెంచేశారు. ఇటీవల మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో వరి పంట పూర్తిగా నీట మునిగింది. దీనిని సాకుగా చూపించి అప్పుడే మిల్లర్లు బియ్యం రేట్లు అధికం చేశారు.

బియ్యం బస్తాలు

పది రోజుల్లో భారీగా పెరుగుదల

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి పంట

ఇదే అదనుగా రేటు పెంచేసిన మిల్లర్లు

అదే బాటలో కూరగాయల ధరలు

వంకాయలు కిలో రూ.70, బెండ రూ.70

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 25:

బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. తుఫాన్‌ పేరు చెప్పి మిల్లర్లు గత వారం, పది రోజుల్లో బియ్యం ధరలు పెంచేశారు. ఇటీవల మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో వరి పంట పూర్తిగా నీట మునిగింది. దీనిని సాకుగా చూపించి అప్పుడే మిల్లర్లు బియ్యం రేట్లు అధికం చేశారు.

అనకాపల్లిలో లలిత బ్రాండ్‌ 26 కిలోల బస్తా ఈ నెల మొదటి వారంలో రూ.1,470 ఉండేది. ఇప్పుడు అది రూ.1,550కు చేరింది. అలాగే అమూల్‌ బ్రాండ్‌ బియ్యం బస్తా రూ.1400 నుంచి రూ.1450కి, కల్యాణి రూ.1270 నుంచి రూ.1350కి, బెల్‌ బ్రాండ్‌ రూ. 1400 నుంచి రూ.1520కి చేరింది. ఈ రేటు ఇంకా పెరుగుతుందని మిల్లర్లు భయపెడుతున్నారు. అడ్డగోలుగా బియ్యం ధరలు పెంచుతున్న మిల్లర్లపై విజిలెన్స్‌ దాడులు చేయించాలని కూడా రిటైల్‌ వ్యాపారులే సూచిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఒకేసారి అంటే వారం రోజుల్లో ఒక్కసారిగా బియ్యం ధరలు పెరగడం తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు.

కూరగాయల ధరలూ పెరిగాయి

సాధారణంగా కార్తీక మాసంలో పూజలు, అయ్యప్ప స్వాముల దీక్షలు తదితరాల వల్ల మాంసాహారం మానేసి అత్యధికులు కూరగాయలే వినియోగిస్తారు. ఆ నెలలో రేట్లు పెరగడం సహజం. కానీ ఇప్పుడు కార్తీకం ముగిసి మార్గశిరం వచ్చినా రేట్లు ఇంకా పెరుగుతున్నాయి. మొన్నటివరకు ఉల్లి, టమాటా ధరలు ఎక్కువగా ఉండేవి. ఉల్లి రూ.46, టమాటా 36 వరకు అమ్ముడుపోయేవి. ఇప్పుడు ఈ రెండూ కాస్త తగ్గాయి. ఉల్లి కిలో రూ.30కి, టమాటా రూ.30కి లభిస్తున్నాయి. కానీ మిగిలిన కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. వంకాయలు రూ.70, బీరకాయలు రూ.70లు, దొండకాయలు రూ.70లు, బరబాటి రూ.80లు, బెండకాయలు రూ.70లు, చిక్కుడుకాయలు రూ.100లు, బీన్స్‌ పిక్కలు రూ. 170ల వరకు ధర పలుకుతున్నాయి. దీనికి కూడా తుఫానే కారణమని, పంటలన్నీ పోయాయని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కాలీ ఫ్లవర్‌, చిక్కుడు మాత్రమే పండుతున్నాయి. మిగిలినవన్నీ ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంతంతమాత్రంగా ఉన్న పంటలు కావడం, ఇక్కడ వినియోగం ఎక్కువ కావడంతో ఎక్కువ రేట్లు పెట్టి తెప్పిస్తున్నామని, అందుకే అధిక ధరలకు విక్రయించాల్సి వస్తోందని టోకు వర్తకులు చెబుతున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising