నాటడం, పీకడం!
ABN, Publish Date - Dec 24 , 2023 | 01:04 AM
నగర సుందరీకరణ పేరుతో జీవీఎంసీ అధికారులు నిధులు దుబారా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జీవీఎంసీకి ఇదే పని
తెలుగుతల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కుండీల్లో గతంలో ఉన్న మొక్కలను
తొలగించి ఎనిమిది నెలల కిందట కొత్తవి నాటించిన అధికారులు
ఇప్పుడు వాటిని తొలగించి మళ్లీ కొత్తవి నాటుతున్న వైనం
డబ్బులు దుబారా చేస్తున్నారనే విమర్శలు
సుందరీకరణ కోసమంటున్న అధికారులు
విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
నగర సుందరీకరణ పేరుతో జీవీఎంసీ అధికారులు నిధులు దుబారా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరం లేకపోయినా అనవసర ఖర్చు పెడుతున్నారని నగరవాసులు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీ-20 సదస్సు సందర్భంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్ డివైడర్‌పై 150 సిమెంట్ కుండీల్లో అప్పటికే ఉన్న మొక్కలను తొలగించి, కొత్తవాటిని నాటారు. ఎనిమిది నెలలు కూడా గడవకముందే ఇప్పుడు ఆ మొక్కలను పెకిలించి తీసేస్తున్నారు. వాటి స్థానంలో కొత్త మొక్కలను తెచ్చి నాటుతున్నారు. ముందున్న మొక్కలన్నీ చక్కగానే ఉన్నప్పటికీ ఎందుకు వాటిని తొలగిస్తున్నారో ఎవరికీ అంతబట్టడం లేదు. అవసరమైన చోట మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిపోయి, తరచూ మొక్కలు నాటడం, పెకిలించడం కోసం డబ్బులు వృధా చేస్తున్నారు. ఈ విషయం జీవీఎంసీ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ వద్ద ప్రస్తావించగా, నగరవాసులకు సంక్రాంతి సందర్భంగా కొత్తఅందాలను చూపించాలనే ఉద్దేశంతోనే తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై కొత్తగా మొక్కలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. అక్కడ తొలగిస్తున్న మొక్కలను కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేట బ్రిడ్జిపై కుండీల్లో నాటుతామన్నారు. దీనివల్ల బ్రిడ్జిపై కాలుష్యం కూడా తగ్గుతుందని వివరించారు.
Updated Date - Dec 24 , 2023 | 01:04 AM