కలెక్టరేట్‌లో జీసీసీ కాఫీ స్టాల్ ప్రారంభం
ABN, First Publish Date - 2023-11-26T01:00:32+05:30
స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జీసీసీ కాఫీ స్టాల్‌ను కలెక్టర్ సుమిత్‌కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే జీసీసీ కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పాడేరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జీసీసీ కాఫీ స్టాల్‌ను కలెక్టర్ సుమిత్‌కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే జీసీసీ కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ స్టాల్‌లో కాఫీతో పాటు జీసీసీకి చెందిన పలు ఉత్పత్తులు విక్రయిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో పి.అంబేడ్కర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ, కలెక్టరేట్ ఏవో చిన్నికృష్ణ, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి శ్యామ్‌కుమార్, జీసీసీ డీఎం డి.సింహాచలం, ఎస్‌టీవో ఎన్.సరిత, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-11-26T01:00:34+05:30 IST