ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దసపల్లా హిల్స్‌లో రోడ్డు విస్తరణపై అభ్యంతరాలు!

ABN, Publish Date - Dec 24 , 2023 | 01:02 AM

దసపల్లా హిల్స్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 40 అడుగులు రహదారిని వంద అడుగులకు విస్తరించే ప్రతిపాదనపై జీవీఎంసీకి సుమారు 20 అభ్యంతరాలు అందినట్టు సమాచారం.

విస్తరణకు వ్యతిరేకంగా కోర్టులో పలువురు పిల్‌ దాఖలు

విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

దసపల్లా హిల్స్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 40 అడుగులు రహదారిని వంద అడుగులకు విస్తరించే ప్రతిపాదనపై జీవీఎంసీకి సుమారు 20 అభ్యంతరాలు అందినట్టు సమాచారం. రోడ్డు విస్తరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19వ తేదీ లోగా తెలపాల్సిందిగా కోరుతూ జీవీఎంసీ అధికారులు నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది రోడ్డు విస్తరణ అవసరం లేదని, మరికొందరు జీవీఎంసీ చేసిన ఆర్‌డీపీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నట్టు తెలిసింది. మరోవైపు రోడ్డు విస్తరణ జరిగితే తమ ఆస్తులు నష్టపోయే అవకాశం ఉందని భావించిన పలువురు విస్తరణ ప్రతిపాదనను నిలుపుదల చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు పిల్‌ దాఖలు చేయగా, మరో ఇద్దరు కూడా పిల్‌ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. రోడ్డు విస్తరణకు జారీచేసిన నోటిఫికేషన్‌పై ఎన్ని అభ్యంతరాలు అందాయనే దానిపై జీవీఎంసీ చీఫ్‌ సిటీప్లానర్‌ బి.సురేష్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రతించేందుకు యత్నించగా ఆయన అందుబాటులో లేరు.

Updated Date - Dec 24 , 2023 | 01:02 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising