ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఖాకీ సెటిల్‌మెంట్‌!

ABN, Publish Date - Dec 31 , 2023 | 01:20 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఒక అధికారి చెలరేగిపోతున్నారు.

చోరీ కేసులో పట్టుబడిన వ్యాన్‌ను విడిచిపెట్టేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌

రూ.3.5 లక్షలు తీసుకుని విడిచిపెట్టేందుకు యత్నం

విషయం బయటపడడంతో ఉన్నతాధికారుల ఆరా

విచారణకు ఆదేశం

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్ర జ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఒక అధికారి చెలరేగిపోతున్నారు. చోరీసొత్తు రికవరీలో చేతివాటం చూపించే సదరు అధికారి...స్ర్కాప్‌ దుకాణదారుల నుంచి నెలవారీ వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చోరీ కేసులో సొత్తుతో పట్టుబడిన వాహనాన్ని విడుదల చేసేందుకు కూడా లంచం తీసుకున్నారంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

వెస్ట్‌జోన్‌ నేర పరిశోధన విభాగం పరిధిలోని ఒక స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారి తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన పై అధికారిని ప్రసన్నం చేసుకుని ఎటువంటి ఇబ్బందీ రాకుండా జాగ్రత్తపడుతున్నారంటున్నారు. ఆమధ్యకాలంలో సదరు అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే తాను ప్రసన్నం చేసుకున్న ఉన్నతాధికారినే విచారణకు నియమించడంతో సురక్షితంగా బయటపడగలిగారు. ప్రస్తుతానికి వస్తే...నగర శివారులోని జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో పనుల కోసం ఇనుము కొనుగోలు చేసి ఉంచారు. ఈనెల 24న అర్ధరాత్రి సమయంలో కొంతమంది ఐషర్‌ వ్యాన్‌తో లేఅవుట్‌లోకి చొరబడి, సుమారు ఆరు టన్నులు లోడ్‌ చేశారు. వ్యాన్‌ను బయటకు తీసుకువెళ్లిపోతుండగా సైట్‌ సూపర్‌వైజర్‌ వ్యాన్‌ను డ్రైవర్‌తో సహా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. దీనిపై సైట్‌ ఇంజనీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. అయితే కేసులో వ్యాన్‌ను విడుదల చేసుకోని పక్షంలో ఏళ్ల తరబడి స్టేషన్‌లోనే ఉండిపోవాల్సి ఉంటుంది. అలా జరిగితే వ్యాన్‌ పాడైపోతుందనే భయంతో యజమాని సదరు పోలీస్‌ అధికారి వద్దకు వెళ్లి వ్యాన్‌ను విడుదల చేసేలా సహకరించాలని కోరారు. తనకు రూ.ఐదు లక్షలు ఇస్తే వ్యాన్‌ను వదిలేస్తానంటూ ఆయన బేరం పెట్టారు. చివరకు రూ.3.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదరడంతో ఆ మొత్తాన్ని వ్యాన్‌ యజమాని సంబంధిత ఎస్‌ఐకి అందజేశాడు. కేసులో ఫిర్యాదుదారుడు, వ్యాన్‌ యజమాని రాజీ పడ్డారనే సాకును చూపించి వ్యాన్‌ను వదిలేయవచ్చునంటూ పోలీస్‌ అధికారి తనకు అనుకూలంగా ఉండే పై అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలో విషయం బయటకు పొక్కింది. పోలీస్‌ కమిషనరేట్‌లోని ఉన్నతాధికారులకు చేరింది. దీనిపై విచారణ జరుగుతున్నట్టు పోలీస్‌ వర్గాలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా చోరీలను నియంత్రణకు కఠినంగా వ్యవహరించాల్సిన పోలీస్‌ అధికారి లంచం కోసం చోరీలను ప్రోత్సహించేలా పనిచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Dec 31 , 2023 | 01:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising