ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో వృత్తిదారులకు అన్యాయం

ABN, Publish Date - Dec 23 , 2023 | 01:06 AM

వైసీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కులవృత్తులు చేసుకొనేవారి నిధులు దారిమళ్లించి ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

మాట్లాడుతున్న బుద్ద నాగజగదీశ్వరరావు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు

అనకాపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కులవృత్తులు చేసుకొనేవారి నిధులు దారిమళ్లించి ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో వున్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. బీసీ కార్పొరేషన్‌ల ద్వారా 4.5 లక్షల మందికి రూ.2,300 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 1.8 లక్షల మందికి రూ.2,500 కోట్లు, కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.1,441 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. కానీ వైసీపీ ప్రభుత్వం నవరత్నాల నిధులనే కార్పొరేషన్ల నిధులుగా చూపుతూ అంకెల గారిడీ చేస్తున్నదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో టీడీపీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ నారాయణరావు, ఎం.నీలబాబు, రామకృష్ణ, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 01:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising