మెరుగైన ఉత్తీర్ణత సాధించండి
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:46 PM
పదో తరగతి విద్యార్థులు యూటీఎఫ్ రూపొందించిన మోడల్ టెస్త్ పేపర్లు చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చునని డీఈఓ ఎల్. చంద్రకళ అన్నారు.
ఆరిలోవ, డిసెంబరు 30 : పదో తరగతి విద్యార్థులు యూటీఎఫ్ రూపొందించిన మోడల్ టెస్త్ పేపర్లు చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చునని డీఈఓ ఎల్. చంద్రకళ అన్నారు. శనివారం ఆమె తన కార్యాలయంలో యూటీఎఫ్ ముద్రించిన టెన్త్ మోడల్ టెస్ట్ పేపర్లను, నూతన క్యాలెం డర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది రూపొందించిన టెస్టు పేపర్ల నుంచి 70 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయన్నారు. విద్యార్థులు టెస్టు పేపర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ గౌరీ శంకర్, డీసీబీ కార్యదర్శి కృష్ణకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, టీఆర్ అంబేడ్కర్ , చినగదిలి మండల ప్రధాన కార్యదర్శి పద్మావతి పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 11:46 PM