ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్టీల్‌ప్లాంట్‌ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం

ABN, First Publish Date - 2023-11-20T00:17:42+05:30

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 1,011వ రోజుకు చేరాయి.

దీక్షా శిబిరంలో కూర్చున్న నాయకులు, కార్మికులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, నవంబరు 19: స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 1,011వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమష్టి పోరాటాలతో ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామన్నారు. ప్రజా సంపదను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీ వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడుతుండడం దారుణమన్నారు. నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సంపదలను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకే చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యు.రామస్వామి, జె.రామకృష్ణ, గంగవరం గోపి, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising