ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాలాజీ హై హిల్స్‌లో చోరీకి యత్నం

ABN, First Publish Date - 2023-12-03T00:45:51+05:30

అప్పన్నపాలెం సమీపంలోని బాలాజీ హిల్స్‌లో దొంగలు చొరబడి చోరీకి యత్నించారు. ఇక్కడి గేటేడ్‌ కమ్యునిటీలో సుమారు ఫ్లాట్‌ను ఉన్నాయి. వీటిలో చివర ఉన్న సీ, డీ బ్లాక్‌లో తాళాలు వేసి ఉన్న నాలుగు ఫ్లాట్‌లలో శుక్రవారం అర్ధరాత్రి రెండున్నర సమయంలో చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు.

వేపగుంట, డిసెంబరు 2: అప్పన్నపాలెం సమీపంలోని బాలాజీ హిల్స్‌లో దొంగలు చొరబడి చోరీకి యత్నించారు. ఇక్కడి గేటేడ్‌ కమ్యునిటీలో సుమారు ఫ్లాట్‌ను ఉన్నాయి. వీటిలో చివర ఉన్న సీ, డీ బ్లాక్‌లో తాళాలు వేసి ఉన్న నాలుగు ఫ్లాట్‌లలో శుక్రవారం అర్ధరాత్రి రెండున్నర సమయంలో చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. వీటిలో రెండిళ్లకు లాక్‌లు తీయలేకపోయారు. ఒక ఇంటి తాళాన్ని తాళం పగులగొట్టి లోపలకు ప్రవేశించే సమయంలో మరో ఇంట్లో ఉన్న మహిళ కార్తీక మాసం పూజల కోసం నిద్ర లేచి వీరిని చోసి పెద్దగా కేకలు వేసింది. దీంతో దొంగలు పారిపోయారు. తాళం విరగొట్టిన ఇంట్లో ఎవరూ లేరు. ఆ ఇంల్లో ఎటువంటి వస్తువులు, నగదు పోలేదని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పెందుర్తి కైమ్‌ పోలీసులు ఘటనా స్థలానికి డాగ్‌ స్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లతో చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే అపార్టుమెంట్‌ పరిసరాలను కైమ్‌ డీసీపీ నాగన్న, ఏడీసీపీ గంగాధర్‌, ఏసీపీ సునీల్‌, వెస్ట్‌ సీఐ రాజు పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. దొంగలు అపార్ట్‌మెంట్‌ వెనక గోడ ఎత్తు తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి లోపలకు ప్రవేశించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల నంచి వివరాలు సేకరంచి కైమ్‌ ఎస్‌.ఐ. మహ్మద్‌ సత్వాన్‌ బేగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-12-03T00:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising