ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలి
ABN, First Publish Date - 2023-12-11T00:41:13+05:30
స్థానిక పెద్ద చెరువులో టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడడానికి కారణమైన ఫార్మా కంపెనీలపై చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు ఆదివారం పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.
పరవాడ స్టేషన్‌లో పెద్ద చెరువు ఆయకట్టు రైతుల ఫిర్యాదు
పరవాడ, డిసెంబరు 10: స్థానిక పెద్ద చెరువులో టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడడానికి కారణమైన ఫార్మా కంపెనీలపై చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు ఆదివారం పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఫార్మా పరిశ్రమల వ్యర్థ జలాల కారణంగా మత్స్యసంపద మృత్యువాత పడిందని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాంకీ యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా మూడుసార్లు ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయకట్టు రైతుల సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాసరావు, పైలా రామచంద్రరావు, చుక్క గోపి, శిరపురపు శ్రీనివాసరావు, రాజు తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2023-12-11T00:41:15+05:30 IST