ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పర్యాటకుల కోలాహలం

ABN, Publish Date - Dec 25 , 2023 | 12:52 AM

క్రిస్మస్‌ పండగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకుల సందడి అధికమైంది. ఏజెన్సీలో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో పర్యాటకులే దర్శనమిచ్చారు.

కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకులు

వరుస సెలవులు రావడంతో మన్యానికి పోటెత్తిన జనం

బొర్రా గుహలు నుంచి లంబసింగి వరకు సందడి

(ఆంధ్రజ్యోతి- పాడేరు, న్యూస్‌ నెట్‌వర్క్‌)

క్రిస్మస్‌ పండగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకుల సందడి అధికమైంది. ఏజెన్సీలో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో పర్యాటకులే దర్శనమిచ్చారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల హడావిడి కనిపించింది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం ప్రాంతాలను అధిక సంఖ్యలో సందర్శకులు తిలకించారు.

వంజంగి మేఘాల కొండ వద్ద..

పాడేరురూరల్‌: మండలంలోని వంజంగి మేఘాల కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. శనివారం రాత్రికి పాడేరుకు చేరుకున్న పర్యాటకులు లాడ్జీలు ఖాళీ లేకపోవడంతో వంజంగి చేరుకొని అక్కడ ఉన్న టెంట్‌లు, రిసార్ట్స్‌లో బస చేశారు. అక్కడ యాజమాన్యం ఏర్పాటు చేసిన క్యాంప్‌ ఫైర్‌, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆనందంగా గడిపారు. ఉదయం 5 గంటల నుంచి కొండపైకి చేరుకొని పాల సముద్రాన్ని తలపించే మేఘాలు, సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలు వంటి ప్రకృతి దృశ్యాల నడుమ ఆనందంగా గడిపారు.

బొర్రా గుహలు కిటకిట

అరకులోయ: ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలుకు సందర్శకులు పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే ప్రవేశ రుసుము టికెట్ల ద్వారా రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. రాత్రి 8 గంటల వరకు పర్యాటకులు గుహలను సందర్శిస్తూనే ఉన్నారు. బొర్రా గుహలుకు వచ్చే వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఘాట్‌ రోడ్డులో పర్యాటకుల రద్దీ నెలకొంది. మాడగడ హిల్స్‌ కిటకిటలాడింది.

లంబసింగిలో..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. కొంత మంది పర్యాటకులు ముందు రోజే లంబసింగికి చేరుకోగా ఎక్కువ మంది ఉదయం ఐదు గంటలకు ఇక్కడకు చేరుకున్నారు. దీంతో లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం పర్యాటకులతో ఉదయం నుంచే సందడి నెలకొన్నది. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్దకు వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. శ్వేత వర్ణంలో మేఘాలు అడవులను తాకుతూ పయనిస్తుంటే ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.

కొత్తపల్లి జలపాతంలో...

జి.మాడుగుల: ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతం పర్యాటకులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే పర్యాటకులతో జలపాతం ఆవరణ కిక్కిరిసింది. ఆదివారం రికార్డు స్థాయిలో 3,322 మంది జలపాతాన్ని సందర్శించారు. దీంతో పార్కింగ్‌ స్థలం సైతం వాహనాలతో రద్దీగా మారింది.

చాపరాయి వద్ద...

డుంబ్రిగుడ: మండలంలోని చాపరాయి జలవిహారిలో ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సందర్శకులతో జలపాతం కిక్కిరిసి పోయింది. పర్యాటకులు జలపాతంలో జలకాలాడుతూ ఆనందంగా గడిపారు. చాపరాయి జలపాతం రోడ్డుకు ఆనుకుని వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Updated Date - Dec 25 , 2023 | 12:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising