ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హామీల అమలులో 85 శాతం విఫలం

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:25 AM

అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్‌ ప్రభుత్వం 85 శాతం విఫలమైందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, గూనూరు మల్లునాయుడు ఆరోపించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ ఆ తరువాత ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలను కూడా మూసివేయించారని అన్నారు.

జగన్‌ ప్రభుత్వంపై ముద్రించిన ప్లకార్డును ప్రదర్శిస్తున్న తాతయ్యబాబు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు తదితరులు

- జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

- టీడీపీ నేతల ధ్వజం

చోడవరం, డిసెంబరు 30: అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్‌ ప్రభుత్వం 85 శాతం విఫలమైందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, గూనూరు మల్లునాయుడు ఆరోపించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ ఆ తరువాత ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలను కూడా మూసివేయించారని అన్నారు. మూర్ఖుడైన జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, రైతులను నట్టేట ముంచేశారని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం చెరకు రైతులకు బకాయిలు ఇవ్వడానికి కూడా వంద వాయిదాలు వేస్తూ, రైతులను వంచనకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే గోవాడను కూడా మూసివేత జాబితాలోకి పంపిచేస్తుందని ఎద్దేవా చేశారు. రైతులపై ఈ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇటు రైతులను, అటు సామాన్యులను కూడా మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీల విషయంలో మాటతప్పిన జగన్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ వైస్‌ ఎంపీపీ భూతనాథు నానికుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి వెంకట అప్పారావు, గౌరీపట్నం ముసలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising