ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

1,01,146 ఓటరు జాబితాల సవరణకు అందిన దరఖాస్తుల సంఖ్య ఇది!

ABN, First Publish Date - 2023-12-11T01:18:48+05:30

తప్పులు లేని ఓటరు జాబితాలను రూపొందించే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నమోదు, తొలగింపు, సవరణకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 9వ తేదీ శనివారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,01,146 దరఖాస్తులు అందాయి.

కొత్తగా ఓటు నమోదుకు 35,276 మంది దరఖాస్తు

పేర్లు తొలగింపునకు 29,913, చిరునామా మార్పు, తప్పుల సవవరణకు 35,957 దరఖాస్తులు

ఈ నెల 26వ తేదీలోగా అర్జీలు పరిష్కారం

వచ్చే నెల 5వ తేదీన తుది ఓటరు జాబితాలు విడుదల

అనకాపల్లి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తప్పులు లేని ఓటరు జాబితాలను రూపొందించే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నమోదు, తొలగింపు, సవరణకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 9వ తేదీ శనివారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,01,146 దరఖాస్తులు అందాయి.

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఈ ఏడాది ఆగస్టు/ సెప్టెంబరు నెలల్లో ఇంటింటా ఓటరు సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించడానికి, ఇంకా తప్పుల సవరణ, చిరునామా మార్పులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. చేర్పులు, తొలగింపుల ప్రక్రియ తరువాత అక్టోబరు 27వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని జిల్లాలో మొత్తం 12,57,707 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,13,144, మహిళా ఓటర్లు 6,44,516 మంది, ఇతరులు 47 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 5వ తేదీన ప్రకటించిన ఓటరు జాబితాలతో పోలిస్తే జిల్లాలో 26,811 మంది ఓటర్లు తగ్గారు. ముసాయి ఓటరు జాబితాలను పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచారు. తుది ఓటరు జాబితాల రూపకల్పన కోసం జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద నవంబరు 4, 5 తేదీల్లో, డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేకంగా ఫిర్యాదులను స్వీకరిస్తారని కలెక్టర్‌ తెలిపారు. ఓటరు జాబితాల్లో చేర్పులు, మార్పులకు ఈ ఏడాది డిసెంబరు 9వ తేదీ వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు.

కాగా ముసాయిదా ఓటరు జాబితాలను పరిశీలించిన విపక్షాల నాయకులు, కార్యకర్తలు... సక్రమంగా రూపొందించలేదని గుర్తించారు. చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారిపేర్లు తొలగించలేదని, పలువురికి రెండు, మూడుచోట్ల ఓట్లు వున్నాయని, డోర్‌ నంబర్లు లేకుండా పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేశారంటూ ఆధారాలతో సహా అధికారులకు అందజేశారు. మరోవైపు కొత్త ఓటర్లు నమోదు, తొలగింపులు, తప్పుల సవరణ, చిరునామా మార్పు, తదితర వాటికి సంబంధించి 1,01,146 దరఖాస్తులు అందాయి. కొత్తగా ఓటు నమోదు కోసం 35,276 మంది దరఖాస్తు (ఫారం-6) చేసుకున్నారు. చనిపోయిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు తొలగింపు, ఇతరత్రా అభ్యంతరాల కోసం 29,913 దరఖాస్తులు (ఫారం-7) అందాయి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్పు, తప్పుల సవవరణ కోసం 35,957 దరఖాస్తులు (ఫారం-8) స్వీకరించారు. వీటిన బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, డిసెంబరు 26వ తేదీ నాటికి పరిష్కారం చూపుతారు. 2024 జనవరి 5న తుది ఓటరు జాబితాలు ప్రకటిస్తారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు

నియోజకవర్గం ఫారం-6 ఫారం-7 ఫారం-8 మొత్తం

అనకాపల్లి 7,152 4,755 5,891 17,726

నర్సీపట్నం 5,804 5,294 5,904 17,004

చోడవరం 4,466 4,307 4,579 13,352

మాడుగుల 4,569 3,587 3,593 11,749

ఎలమంచిలి 5,688 5,597 6794 18,079

పాయకరావుపేట 7,594 6,373 9,268 23,236

Updated Date - 2023-12-11T01:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising